కొరటాల శివ డైరెక్ట్ మొదటి సినిమా ‘మిర్చి’ ఈరోజే విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా హిట్ కావడంతో కొరటాల శివ రెండవ సినిమాని ప్రేస్టీజియస్ బ్యానర్లో చేసే అవకాశం కొట్టేసాడు. మాకు అందిన సమాచారం ప్రకారం గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అందించిన పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మాణంలో కొరటాల శివ రెండవ సినిమా డైరెక్ట్ చేయనున్నాడు. ప్రముఖ హీరో ఈ సినిమాలో నటించే అవకాశం ఉందని సమాచారం. గబ్బర్ సింగ్ తరువాత బండ్ల గణేష్ ప్రస్తుతం ఒకేసారి రెండు సినిమాల నిర్మాణంలో బిజీగా ఉన్నారు. శ్రీను వైట్ల డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ‘బాద్షా’ సినిమాని పూరి జగన్నాధ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలు నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. ఇవే కాకుండా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్లో మహేష్ బాబుతో ఒకటి చరణ్ తో మరొక సినిమాలు గణేష్ నిర్మించనున్నారు.