యాక్షన్ స్టార్ట్ చేసిన రమ్ టీం

RUM
ఎం.ఎస్ రాజు నిర్మించనున్న తాజా చిత్రం ‘రమ్ (రంభ, ఊర్వశి, మేనక)’ ప్రస్తుతం మస్కట్ లోని ఓమన్లో జరుగుతోంది. త్రిష, చార్మీ, ఇషా చావ్లా, నిఖీషా పటేల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర టీం మస్కట్ కి చేరుకుంది. త్రిష – చార్మీ మస్కట్ లో వారు చేస్తున్న అడ్వెంచర్ ఫోటోలను కూడా వీళ్ళు పొస్ట్ చేసారు. ‘మొదటి రోజు షూటింగ్ -విజయన్ మాస్టర్ నేతృత్వంలో యాక్షన్ సీన్స్ మొదలయ్యాయి. కార్ల చేజింగ్ సీన్స్ లో నా చుట్టూ లైన్స్ నేనేమొ కార్ చక్రం వద్ద .. వామ్మొ ఈ సీన్స్ తో హీరోల మీద గౌరవం పెరిగిపోయిందని’ త్రిష ట్వీట్ చేసింది. ‘వానా’, ‘తూనీగా తూనీగా’ సినిమా తర్వాత ఎం.ఎస్ రాజు డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది.

Exit mobile version