ఢిల్లీ భామ తాప్సీ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండున్నర సంవత్సరాలైంది. ఈ రెండున్నర సంవత్సరాల్లో ప్రభాస్, రవితేజ, గోపీచంద్, మంచు మనోజ్ లాంటి హీరోల సరసన నటించిన ఈ భామ త్వరలోనే వెంకటేష్ సరసన ‘షాడో’ సినిమాలో నటిస్తోంది. ఇది కాకుండా ఈ సంవత్సరం డేవిడ్ ధావన్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘చష్మే బదూర్’ సినిమాతో బాలీవుడ్లో ఎంటర్ కానుంది. ఈ సినిమా ఫస్ట్ టీజర్ ఈ రోజు విడుదలైంది. ఇప్పటివరకూ ఈ టీజర్ కి రెస్పాన్స్ బాగుంది.
ఈ సినిమాలో నాలుగు ప్రధాన పాత్రలు ఉండనున్నాయి అందులో తాప్సీ తో పాటు అలీ జాఫర్, సిద్దార్థ్, దివ్యేందు శర్మ నటించారు. ఈ సినిమా రిలీజ్ ఇప్పటికే మూడు సార్లు పోస్ట్ పోన్ అయ్యింది చివరిగా ఈ సినిమాని ఏప్రిల్ 5 న రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం తాప్సీ తెలుగులో ‘షాడో’ సినిమాతో పాటు గోపీచంద్ – యేలేటి సినిమాలో నటిస్తోంది. అలాగే తాప్సీ నటించిన ‘గుండెల్లో గోదారి’ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.