నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కలసి “సింహా” సినిమా తో బాక్స్ ఆఫీసు షేక్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా బాలకృష్ణ కు ఏంతో స్పెషల్, ఎందుకంటే చాలా రోజుల తరువాత ఈ సినిమా హిట్ సాదించింది. మళ్లీ వాళ్ళిద్దరూ కలిసి “రులర్ ” అనే సినిమా తియబోతున్నారని సమాచారం.
ఈ సినిమా రాజకీయలుకు సంభందించినదిగా ఉండవచ్చు. ఈ సినిమాని 2014 ఎలక్షన్లకు ముందు విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైనర్ బ్యానర్ లో నిర్మించే అవకాశం ఉందని సమాచారం. బాలకృష్ణ ఈ సినిమా కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు.త్వరలో ఈ సినిమాకు సంబందించిన వివరాలు తెలియజేస్తాము. .