ఎవడులో రీమిక్స్ సాంగ్ లేదు

Yevadu

రచ్చ, నాయక్ సినిమా విజయాలతో జోరుమీదున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎవడు సినిమాలో కూడా రీమిక్స్ సాంగ్ సెంటిమెంట్ కంటిన్యూ చేస్తాడంటూ వస్తున్న పుకార్లకి ఫుల్ స్టాప్ పెట్టారు. మగధీర సినిమాలో బంగారు కోడి పెట్ట సాంగ్ రీమిక్స్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చరణ్ ఆ తరువాత ఆరంజ్ సినిమాలో సినిమాలో ఎలాంటి రీమిక్స్ సాంగ్ లేకపోవడం సినిమా ఫ్లాప్ అవడం జరిగిపోయాయి. తరువాత వచ్చిన రచ్చ వాన వాన వెల్లువాయే సాంగ్ రీమిక్స్, నాయక్ సినిమాలో శుభలేఖ రాసుకున్నా పాటని రీమిక్స్ చేయడం రెండు సినిమాలు హిట్ కావడంతో ఆ సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ ఎవడులో రీమిక్స్ సాంగ్ ఉంటుందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్ని దేవి శ్రీ ప్రసాద్ కొట్టి పారేసాడు. ఎవడులో అన్ని ఒరిజినల్ సాంగ్స్ ఉన్నాయని రీమిక్స్ సాంగ్ లేదని చెప్పుకొచ్చాడు.

Exit mobile version