బాద్షాలో బ్రహ్మానందం పోలీసుగా నటిస్తున్నడా?

Brahmi-BDay

శ్రీను వైట్ల సినిమా అనగానే బ్రహ్మానందంకి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. తన ప్రతి సినిమాలో ఇచ్చే ప్రతీ పాత్రా ఫన్నీగా ఉండేలా డిజైన్ చేసి బ్రహ్మానందంని పూర్తిగా వాడుకుంటాడు. ఈ తరం దర్శకుల్లో బ్రహ్మానందంని కరెక్టుగా వాడుకునేది శ్రీను వైట్ల ఒక్కటే అనేది వాస్తవం. శ్రీను వైట్ల ప్రస్తుతం డైరెక్ట్ చేస్తున్న బాద్షా సినిమాలో బ్రహ్మానందం కీలక పాత్రా చేస్తున్నాడు. ఇటీవల బ్రహ్మి పుట్టినరోజు సందర్భంగా బాద్షా సెట్లో కేకు కట్ చేసిన బ్రహ్మి ఆ సమయంలో పోలీస్ దుస్తుల్లో ఉన్నాడు. దీంతో బ్రహ్మి పోలీస్ కానిస్టేబుల్ లాంటి పాత్ర పోషించాడని అర్ధమవుతుంది.

Exit mobile version