పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ చిత్ర షూటింగ్ ప్రస్తుతం సిటీ సెంటర్లో జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ మధ్య ఉన్న సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. నోవాటెల్ హోటల్లో నిన్న షూటింగ్ జరిగింది. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తరువాత పొల్లాచ్చిలో షూటింగ్ చేయనున్నారు. ఈ సినిమా ఫామిలీ విత్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్నట్లు సమాచారం. ఈ సినిమాని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ భాధ్యతలు చూసుకుంటున్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో విడుదలయ్యే అవకాశం ఉంది.