బాలీవుడ్లో విలన్ పాత్రలు చేయాలని ఉంది : రాజశేఖర్

Rajasekhar

అంకుశం, ఆహుతి, తలంబ్రాలు, అన్న, శివయ్య, అన్నయ్య, ఎవడైతే నాకేంటి లాంటి ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో పేరు సంపాదించుకున్న డాక్టర్ రాజశేఖర్ పుట్టిన రోజు ఈ రోజు. ఏడాది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏడాది కాలంగా సినిమాలకి దూరంగా ఉన్నందుకు తానేమీ భాధ పడట్లేదని, ఈ సంవత్సర కాలంలో డాక్టర్ గా ప్రాక్టీసు చేసానని అన్నారు. ఐదుగురు కాన్సర్ పేషెంట్ లకు ఉచితంగా వైద్యం అందించాను. ఆయన నటించిన చివరి సినిమా మహంకాళి ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైందని అన్నారు. అలాగే ప్రాధాన్యత ఉన్న పాత్రలు బాలీవుడ్లో విలన్ పాత్రలు చేయాలని ఉందని మనసులోని మాటను బైట పెట్టారు.

123తెలుగు.కామ్ తరపున డాక్టర్ రాజశేఖర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

Exit mobile version