సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మూడవ సీజన్ ఈ నెల 9 నుండి ప్రారంభం కానుంది. ఈ సంధరంభంగా తెలుగు వారియర్స్ జట్టు పరిచయ కార్యక్రమం నిన్న హైదరాబాదులో జరిగింది. వెంకటేష్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న తెలుగు వారియర్స్ టీంలోకి రామ్ చరణ్ కొత్తగా జత కలిసాడు. బెంగాల్ తిగెర్స్ జట్టుతో తెలుగు వారియర్స్ తలపడే మ్యాచ్ ఈ నెల 10న జరగనుంది. వెంకటేష్ ఒకటో నెంబర్ జెర్సీ, రామ్ చరణ్ 33 నెంబర్ జెర్సీ ధరించి బరిలోకి దిగనున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ వెంకటేష్ గారితో కలిసి ఆడటం గర్వంగా ఫీలవుతున్నా, అయన ఆటగాళ్ళను ఎంకరేజ్ చేస్తూ మసులుకునే విధానం బావుంటుంది. నన్ను ఏడూ లేదా ఎనిమిది స్థానాల్లో పంపిస్తే బావుంటుందని నవ్వుతూ అన్నాడు.