బెస్ట్ కమెడియన్ గా ఇండస్ట్రీలో మంచి పొజిషన్లో ఉన్న టైంలో సునీల్ హీరోగా ట్రై చేసాడు. మొదటి ప్రయత్నం అందాల రాముడు సక్సెస్ అయింది. రెండవ ప్రయత్నం రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన మర్యాద రామన్న కూడా హిట్ అయింది. మూడవ సినిమా అప్పల రాజు బెడిసికొట్టినా పూల రంగడుతో నిలదొక్కుకున్నాడు. సునీల్ లేటెస్ట్ మూవీ మిస్టర్ పెళ్ళికొడుకు ఆడియో నిన్న విడుదలైంది. ఈ అదుఇఒ విడుదల కార్యక్రమంలో వివి వినాయక్ మాట్లాడుతూ హీరోగా నిలడుక్కోవడానికి సునీల్ చేస్తున్న హార్డ్ వర్క్ చూస్తుంటే హార్డ్ వర్క్ కి అతను బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపిస్తుంది. సిక్స్ ప్యాక్ తెచ్చుకోవడానికి సునీల్ పడిన రిస్క్ చూస్తుంటే హేట్సాఫ్ చెప్పాలని ఉంది అన్నారు. ఈ చిత్ర ఆడియో విడుదలకు నాగ చైతన్య, సమంత కూడా విచ్చేసారు.