నాగ చైతన్య, సునీల్ కలిసి నటిస్తున్న వెట్టై రీమేక్ షూటింగ్ ప్రస్తుతం నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది. పెళ్లి పాటకి సంభందించిన పాటని టీం సభ్యులపై చిత్రీకరిస్తున్నారు. సునీల్, చైతన్య అన్నాదమ్ములుగా నటిస్తున్న ఈ చిత్ర ఒరిజినల్ వెర్షన్ వెట్టై తమిళ్లో పెద్ద హిట్ అయింది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం తరువాత కిషోర్ కుమార్ (డాలీ) డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇదే. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన తమన్నా నటిస్తుండగా సునీల్ సరసన ఆండ్రియా జోడీగా నటిస్తుంది. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు.