కెవ్వు కేక కోసం బ్యాంకాక్ వెళ్ళిన అల్లరి నరేష్

Allari-Naresh-shooting-at-G

అల్లరి నరేష్ త్వరలో కెవ్వు కేక పెట్టించబోతున్నాడు. బ్లేడ్ బాబ్జి తరువాత దేవి ప్రసాద్ డైరెక్షన్లో అల్లరి నరేష్ చేస్తున్న రెండవ చిత్రం ఇది. కన్నడ హీరోయిన్ షర్మిల మండ్రే ఈ సినిమాతో తెలుగులో అడుగుపెట్టబోతుంది. అల్లరి నరేష్, షర్మిల మండ్రే చిత్ర బృందంతో కలిసి నిన్న రాత్రి బ్యాంకాక్ బయల్దేరి వెళ్లారు. ఫిబ్రవరి 24 వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. కెవ్వు కేక ఫస్ట్ హాఫ్ అంతా బ్యాంకాక్ నేపధ్యంలో సాగుతుంది. అల్లరి నరేష్ తో సహా ఆరుగురు బృంద సభ్యులు బ్యాంకాక్ వెళ్ళగా అక్కడ వారి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది చిత్ర మూల కథ. చిన్ని చరణ్ సంగీతం అందిస్తున్న కెవ్వు కేక వేసవిలో విడుదల కానుంది.

Exit mobile version