నెల రోజుల నుండి వార్తల్లో నిలుస్తూ వస్తున్న విశ్వరూపం సినిమాకి అడ్డంకులు తొలగిపోయాయి. డీటీహెచ్ వివాదం నుండి ముస్లిం సోదరుల మనోభావాలు దెబ్బ తిన్నాయి అంటూ ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న విశ్వరూపం తమిళనాడులో ఈ నెల ఫిబ్రవరి 8న విడుదల కానున్నట్లు సమాచారం. జనవరి 25న విడుదల కావాల్సిన ఈ సినిమా ముస్లిం మత పెద్దలు అభ్యంతరాలు తెలుపుతూ కోర్టులో మద్రాసు హై కోర్టులో పిటిషన్ వేయడంతో హై కోర్టు విశ్వరూపం సినిమా నిషేధం విధించింది.
తమిళనాడు మినహా ఆంధ్రప్రదేశ్, కేరళ, విదేశాలలో విడుదలైన విశ్వరూపం హిట్ టాక్ సంపాదించుకున్నా తమిళనాడులో మాత్రం కస్థలు తొలగిపోలేదు. నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన మరునాడే మల్లి నిషేధం విధించడంతో కమల్ హాసన్ చేత కంటతడి పెట్టించింది. 24 మంది ముస్లిం మతపెద్దలు కమల్ హాసన్ తో సమావేశమై తమకు అభ్యంతరమున్న 7 సన్నివేశాలని తొలగించమని కోరడంతో కమల్ వాటికి అంగీకరించడంతో సమస్య దాదాపు తొలగిపోయింది. ఆరు గంటల పటు ఈ చర్చలు జరిగినట్లు సమాచారం. ముస్లిం మత పెద్దలు మద్రాస్ హై కోర్టు నుండి కేసు వాపస్ తీసుకునే అవకాశం ఉంది.