సెన్సార్ పూర్తి చేసుకున్న మిర్చి

Mirchi
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘మిర్చి’ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఇంకా అధికారికంగా కొన్ని కార్యక్రమాలు మిగిలి ఉన్నాయి. అందుకే ఇంకా సెన్సార్ వారు సర్టిఫికేట్ డిక్లేర్ చెయ్యలేదు. ఎక్కువ భాగం ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికేట్ వచ్చే అవకాశముంది. ఈ సినిమా నిడివి 2 గంటల 36 నిమిషాలు ఉంటుంది.

ఫిబ్రవరి 8న రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ సినిమాలో అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్ గా నటించారు. కొరటాల శివ డైరెక్టర్ గా మారి చేసిన ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాని యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీకృష్ణా – ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మించారు.

Exit mobile version