యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘బాద్షా’ విడుదలకు ముందే దాదాపు 50 కోట్ల బిజినెస్ చేస్తోంది. క్రేజీ కాంబినేషన్ కావడంతో సినిమా కొనడానికి చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపిస్తున్నారని, ఇప్పటికే కొన్ని ఏరియాల్లో రికార్డు రేట్లకి అమ్ముడయినట్లు సమాచారం. ఎన్టీఆర్, కాజల్ కాంబినేషన్ శ్రీను వైట్ల మార్కు కామెడీ తమన్ సంగీతం తోడైతే సినిమా బంపర్ హిట్ కొట్టడం ఖాయమని వారు నమ్ముతున్నారు. ఇటీవల విడుదల చేసిన ఎన్టీఆర్ కొత్త లుక్ కూడా బావుండటం, శ్రీను వైట్ల ఇటీవలే దూకుడు, నిర్మాత బండ్ల గణేష్ గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి జోరు మీదున్నారు. తమన్ కూడా ఈ మధ్య హిట్ మ్యూజికల్ హిట్ ఆల్బమ్స్ ఇస్తుండటం ఈ సినిమాకి అదిరిపోయే పాటలు ఇస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా ఇంకా 4 పాటల షూటింగ్ బాలన్స్ ఉంది.