షారుఖ్ ఖాన్ సినిమా ఆఫర్ తిరష్కరించిన నయనతార

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ సినిమాలో నటించే ఛాన్స్ ప్రతి రోజూ రాదు.అలా షారుఖ్ ఖాన్ సినిమాలో ఆఫర్ వస్తే ఎవ్వరూ వదులుకోరు. కానీ మన సౌత్ ఇండియన్ అందాల భామ నయనతార మాత్రం దీనికి పూర్తి విరుద్దంగా చేసింది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ చేస్తున్న ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ సినిమాలో ఒక ఐటెం సాంగ్ చెయ్యడానికి డైరెక్టర్ రోహిత్ శెట్టి నయనతారని సంప్రదించాడు.ఆమె ఈ ఆఫర్ ని చాలా సున్నితంగా తిరష్కరించినది.

నయనతార ఇప్పుడు ఇలాంటి ఐటెం సాంగ్స్ చేయ్యలనుకోవటం లేదు. నయనతార తన బాలీవుడ్లో ఒక ఐటెం సాంగ్ ద్వారా పరిచయం కావాలనుకోవడంలేదు. ఈ భామ తన సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ బిజీగా ఉంది. ప్రస్తుతం నయనతార తెలుగులో నాగార్జున సరసన ‘గ్రీకువీరుడు’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా సమ్మర్ కానుకగా రిలీజ్ కానుంది.

Exit mobile version