మణిరత్నం రానున్న చిత్రం “కడలి” ఫిబ్రవరి 1న విడుదలకు సిద్దమయ్యింది. గౌతం కార్తీక్ మరియు తులసి నాయర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. లక్ష్మి మంచు, అరవింద్ స్వామి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం తమిళనాడు లోని ఒక జాలరి గ్రామం బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. ఈ చిత్రంలో క్రైస్తవ మతానికి సంభందించిన సన్నివేశాలు ఉన్నట్టు తెలుస్తుంది అస్ముద్రపు ఒడ్డున భారీగా చర్చ్ సెట్ కూడా నిర్మించారు. ఇందులో అరవింద్ స్వామి చర్చ్ ఫాదర్ పాత్ర పోషిస్తుండటం ఆసక్తికరం. ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూ లో రాజీవ్ మీనన్ మాట్లాడుతూ 16వ శతాబ్దంలో బైబల్ ఆధారిత థీమ్స్ మీద పని చేసే ప్రముఖ పెయింటర్ కారావాగియో పని మణిరత్నం కి బాగా నచ్చినట్టు తెలుస్తుంది అని అన్నారు మణిరత్నం ఈ చిత్రాన్ని మంచికి చెడుకి మధ్య పోరాటం అని చెబుతున్నారు ఈసారి మణిరత్నం ఎటువంటి కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు అని అందరు ఆసక్తిగా వేచి చూస్తున్నారు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.