రాఘవేంద్రరావు సోదరుడు కన్నుమూత

Kovelamudi Krishna Mohan Ra

ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు, RK ఫిలిమ్స్‌ అధినేత కోవెలమూడి కృష్ణమోహన్‌ రావు కన్నుమూశారు. 81 సంవత్సరాల వయసున్న కృష్ణమోహన్ రావు కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. ఉన్నట్టుండి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో జాయిన్ చేశారు కుటుంబసభ్యులు. చికిత్స అనంతరం ఆయన ఇంటికి కూడ తిరిగి వచ్చారు.

మరోసారి ఆరోగ్యం క్షీణించడంతో ఫిల్మ్ నగర్ ఫేస్ 2 రోడ్ నెంబర్ 11లోని తన నివాసంలో కన్నుమూశారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు. వారిలో ఒకరు బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ భార్య లక్ష్మీ. మరో కుమార్తె లత. ఆర్కే ఫిలిమ్స్ బ్యానర్ మీద ఈయన పలు సినిమాలను నిర్మించారు. కాగా రేపు ఫిలిమ్ నగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నాయి.

Exit mobile version