త్రివిక్రమ్ కథతో వైష్ణవ్ తేజ్ ?

Vaishnav Tej

పవన్ కల్యాణ్ బ్యానర్ లో వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ సినిమా రాబోతుందట. త్రివిక్రమ్ అందించిన కథతో ఈ సినిమా తెరకెక్కబోతుందట. ఇంకా ఈ సినిమాకి దర్శకుడిని ఫైనల్ చేయలేదని.. త్వరలోనే దర్శకుడ్ని కూడా ఫైనల్ చేసి సినిమాని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. మొత్తానికి మెగా అభిమానులకు ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ కు ఇది శుభ వార్తనే. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో చూడాలి.

కాగా ‘పింక్’ తెలుగు రీమేక్ వకీల్ సాబ్, అలాగే క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న పవన్, ఈ సినిమాల తర్వాత హరీష శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఈ ఏడాది చివరినాటికి పూర్తైపోతాయి. పవన్ 2022లో కూడా సినిమాలు చేసే ఆలోచనలో ఉండటంతో దర్శకుడు డాలీ కూడా సినిమా చేయడానికి పవన్ నుండి సానుకూల స్పందనే వచ్చిందని, అన్నీ కుదిరితే సినిమా ఓకే అయి, 2022లో వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version