మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘నాయక్’. ఈ సినిమా వచ్చే వారం బాక్స్ ఆఫీసుపై కాసుల వర్షం కురిపించడానికి సిద్దమవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా జనవరి 3న సెన్సార్ కార్య క్రమాలు జరుపుకోనుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్త కాగానే ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకోనున్నాయి. రామ్ చరణ్ కెరీర్లో మొదటి సారిగా డ్యుయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, అమలా పాల్ హీరోయిన్స్ గా నటించారు.
వి.వి వినాయక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని డి.వి.వి దానయ్య నిర్మించాడు. ఎస్.ఎస్ తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సాంగ్స్ మార్కెట్లో పెద్ద హిట్ అయ్యాయి. అలాగే జనవరి 9న విడుదలవుతున్న ఈ సినిమాతో రామ్ చరణ్ బాక్స్ ఆఫీసు వద్ద మరో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు.