తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన “మిథునం” చిత్రాన్ని విలక్షణ దర్శకుడు బాపు ప్రశంసలలో ముంచెత్తారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం మరియు లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ మధ్య కాలంలో విమర్శకుల నుండి పలు ప్రశంసలు అందుకుంది ఇది జరిగిన కొద్ది కాలంలోనే బాపు గారు ఈ చిత్ర దర్శకుడు తనికెళ్ళ భరణికి ఒక ఉత్తరం రాశారు. రమణ గారు రచించిన “మిథునం” పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం విదితమే. ఈ చిత్రానికి నాకు అందిన అన్ని ప్రశంసలలో బాపు గారి ప్రశంస ప్రత్యేకమయినది అని తనికెళ్ళ భరణి అన్నారు. ఈ చిత్రానికి స్వర వీణాపాణి సంగీతం అందించిన ఈ చిత్రానికి రాజేంద్రప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు ఈ చిత్రం త్వరలో అమెరికాలో విడుదల కానుంది.