క్రేజీ గాసిప్..కేజీయఫ్ టీజర్ ను ఇలా ప్లాన్ చేస్తున్నారా.?

ఇప్పుడు మన దక్షిణాది నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ చిత్రాల్లో “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ పై తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం తాలూకా టీజర్ కోసం ఎప్పటి నుంచో అన్ని సినీ వర్గాల అభిమానులు ఎదురు చూస్తున్నారు.

మరి దానికి డేట్ ను కూడా మేకర్స్ లాక్ చేసేసారు. వచ్చే జనవరి 8న యష్ బర్త్ డే సందర్భంగా దానిని విడుదల చేస్తున్నట్టుగా తెలిపారు. అయితే అది ఎలా ఉంటుంది అన్న దానిపై లేటెస్ట్ గాసిప్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈ టీజర్ ను మేకర్స్ కేవలం ఒక్క భాషలోనే విడుదల చేస్తారని అది కూడా నిర్మాణ సంస్థ ఛానెల్ నుంచే వస్తుంది అని టాక్ మొదలయ్యింది.

మరి ఇదే జరిగితే మిగతా ప్రేక్షకులకు నిరాశే అని చెప్పాలి. ఆ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత నుంచి అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఎదురు చూడడం మొదలు పెట్టారు. మరి ఒక భాషలోనే విడుదల చేస్తే వారికి మరింత గడువు పెరిగినట్టే మరి ఈ గాసిప్ ఎంత వరకు నిజమవుతుందో చూడాలి.

Exit mobile version