సోహెల్, మోనాల్ సెట్టయ్యారు..విన్నర్ పరిస్థితి ఏంటి.?

ఈసారి సారి జరిగినటువంటి బిగ్ బాస్ సీజన్ 4 లో టైటిల్ విజేతగా అభిజీత్ నిలిచిన సంగతి తెలిసిందే. గత వారం ఫైనల్స్ తో ఈ సెన్సేషనల్ రియాలిటీ షోకు విన్నర్ గా అభిజీత్ డిక్లేర్ అయ్యాడు. అయితే ఈ షో ద్వారా అభిజీత్ కు తాను చేసిన సినిమాల కంటే ఎక్కువే గుర్తింపు వచ్చింది.

కానీ ఆఫ్టర్ బిగ్ బాస్ పరిస్థితే ఏంటి అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఫైనల్స్ లో అపారమైన గుర్తింపు తెచ్చుకున్న సోహెల్ ఆల్రెడీ ఓ సినిమాను మొదలు పెట్టేసాడు. అలాగే మోనాల్ ఏకంగా ఓ షోకు జడ్జిగా ఫిక్స్ అయ్యి కొన్నాళ్ల పాటు బిజీ అయ్యిపోయింది. కానీ విన్ కాబడిన అభిజీత్ నుంచే ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.

తనదైన వ్యక్తిత్వంతో మంచి మన్ననలు పొందిన అభిజీత్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఖచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటాడని అంతా ఆశిస్తున్నారు. కానీ ఇంకా అభిజీత్ వైపు నుంచి మాత్రం ఎలాంటి మూమెంట్ లేదు. మరి ఇంకా అందుకు సమయం తీసుకుంటున్నాడా లేక మరేమన్నా కారణం ఉందా అన్నది కాలమే నిర్ణయించాలి.

Exit mobile version