“డర్టీ హరి” సినిమాపై సీనియర్ నటుడు నరేష్ ప్రశంసల జల్లు.!

మన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎం ఎస్ రాజు ఎన్నో అద్భుత చిత్రాలను గత రెండు దశాబ్దాలుగా అందించారు. అలాగే ఒక్క నిర్మాణంకే పరిమితం కాకుండా లేటెస్ట్ తాను డైరెక్ట్ చేసిన “డర్టీ హరి” చిత్రాన్ని ఓటిటిలో విడుదల చెయ్యగా దానికి హిట్ టాక్ తెచ్చుకున్నారు.

అంతే కాకుండా పే పర్ వ్యూ లో పెట్టినప్పటికీ మొదటి రోజే మంచి వసూళ్లను రాబట్టారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రంపై ఇప్పుడు సీనియర్ నటుడు నరేష్ తన స్పందనను చెప్పకుండా ఉండలేకపోయారు. డర్టీ హరి సినిమాతో వచ్చే తరాలకు కూడా మంచి సినిమాను దర్శకునిగా పరిచయం చేసారు అని.

అలాగే నెక్స్ట్ జెనరేషన్ లో సినిమాను ఇప్పుడే చేసారని నరేష్ పొగడ్తలతో ముంచేశారు. అంతే కాకుండా ఈ చిత్రాన్ని థియేట్రికల్ విడుదల కోసం ఎదురు చూస్తున్నానని అలాగే తన ట్విట్టర్ ఫాలోవర్స్ ప్రతీ ఒక్కరినీ కూడా ఈ సినిమా చూడాల్సిందిగా కోరారు. ఇక ఈ చిత్రంలో శ్రవణ్ రెడ్డి హీరోగా నటించగా సిమ్రాత్ కౌర్ హీరోయిన్ గా నటించింది.

Exit mobile version