మహేష్, నమ్రతలకు పవన్ దంపతుల బహుమతి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో ఇండస్ట్రీలో ఉన్న తన మిత్రులకు బహుమతులు పంపుతుంటారు. తన ఫామ్ హౌజ్లో మామిడి పంట కాపుకు రాగానే అందరికీ ఆ పండ్లు పంపే పవన్ క్రిస్మస్ సందర్బంగా కూడ బహుమతులు పంపారు. ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత దంపతులకు పవన్ కళ్యాణ్ ఆయన సతీమణి అన్న లెజెనోవా బహుమతులు పంపారు. ఈ విషయాన్ని నమ్రత స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. స్వీట్స్, చాకోలెట్స్ ఇంకొన్ని బహుమతులతో పాటు ఒక మెసేజ్ కూడ పంపారు.

అందులో ఈ శుభదినంలో మీరు మీ కుటుంబం క్షేమంగా ఉండాలని, అన్ని శుభ పరిణామాలను మీరు పొందాలని కోరుకుంటూ మీ అన్నా మరియు పవన్ అని రాసి ఉంది. పవన్ కుటుంబం నుండి అందిన బహుమానానికి నమ్రత వారిద్దరికీ కృతజ్ఞతలు తెలిపారు. పవన్, మహేష్ పేర్లు ఎప్పుడూ నెంబర్ వన్ రేసులో ఉంటాయి. ఇద్దరి సినిమాల మధ్యన తీవ్రమైన పోటీ నడుస్తుంటుంది. ఇరువురి అభిమానుల సంగతైతే చెప్పాల్సిన పనే లేదు. ఎప్పుడూ మీరా మేమా అన్నట్టే ఉంటారు. అయినప్పటికీ వ్యక్తిగతంగా మహేష్, పవన్ మంచి మిత్రులు. ఎదురుపడినప్పుడల్లా ఆప్యాయంగా పలకరించుకుంటూ, శుభసందర్భాల్లో ఆనందాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు.

Exit mobile version