కొత్త కరోనా స్ట్రెయిన్.. ఇండస్ట్రీకి రెండో విడత కష్టాలు ?

కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. వైరస్ దెబ్బకు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు విలవిల్లాడాయి. అనేక అపరిశ్రములు మూతబడ్డాయి. వాటిలో ఫిలిం ఇండస్ట్రీ కూడ ఉంది. షూటింగ్లు జరగక, భారీ బడ్జెట్ సినిమాల చిత్రీకరణలు మధ్యలోనే ఆగిపోవడం, పూర్తయన్ సినిమాలు విధులకు నోచుకోకపోవడంతో ఇండస్ట్రీతో సంబంధం ఉన్న ప్రతిఒక్కరూ ఇబ్బందిపడ్డారు. ఇప్పుడిప్పుడే వైరస్ ప్రభావం తగ్గుతుండటంతో ఇండస్ట్రీ రీస్టార్ట్ అవుతోంది. చిత్రీకరణలు వేగం పుంజుకున్నాయి.

ఇక ఈ నెల 25న ‘సోలో బ్రతుకే సో బెటర్’తో సినిమాల విడుదలకు తొలి అడుగు పడనుంది. విదేశాల్లో చిత్రీకరణలు జరపాలనుకునేవారు ప్లాన్ చేసి పెట్టుకున్నారు. కానీ ఈలోపు కొత్త రకం కరోనా వైరస్ దాపురించింది. కరోనా వైరస్‌లో వెలుగుచూసిన ఉత్పరివర్తనాల ద్వారా ఈ వైవిధ్యాన్ని నిర్వచిస్తున్నారు. ఇది అంటువ్యాధిగా మారి, వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంటే గతంలో వచ్చిన వైరస్ కంటే ఎక్కువ వేగవంతమైనదన్నమాట. ప్రస్తుతం ఈ వైరస్ తాకిడి బ్రిటన్లో కనబడుతోంది. అందుకే బ్రిటన్ నుండి, ఆ దేశం మీదుగా వచ్చే విమాన సర్వీసులను ఇండియాకు నిలిపివేశారు. 31వరకు ఇదే పరిస్థితి ఉందనుంది.

ఈ కొత్త స్ట్రెయిన్ ఇప్పటివరకు ఎక్కడెక్కడికి వ్యాపించి ఉంటుందనేది ఇంకా తేలలేదు. అందుకే ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా రాకపోకల మీద నిషేధాలు విధిస్తున్నాయి చాలా దేశాలు. ఈ నిషేధాల వలన విదేశాల్లో చిత్రీకరణ జరపాలనుకున్న సినిమాలకు మరోసారి ఇబ్బందులు తప్పేలా లేవు. అంతేకాదు ఈ కొత్త స్ట్రెయిన్ ఆనవాళ్లు ఇండియాలో బయటపడితే మాత్రం మళ్ళీ థియేటర్లు మూతబడే అవకాశం ఉంది. ఈ పరిణామాలతో ఇండస్ట్రీలో కొత్త కంగారు నెలకొంది.

Exit mobile version