సినిమా ధియేటర్లో విడుదలకి 12 గంటల ముందే టీవీలో చూసే అవకాశం కల్పిస్తున్నాడు కమల్ హాసన్. ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ బుల్లితెర మీద ముందే సినిమా అవకాశం రాబోతుంది. కమల్ హాసన్ లేటెస్ట్ మూవీ ‘విశ్వరూపం’ సినిమాని 5 డీటీహెచ్ చానల్స్ టెలికాస్ట్ చేయనున్నాయి. ఎయిర్ టెల్, సన్ డైరెక్ట్, డిష్ టీవీ, వీడియోకాన్ కంపెనీలు ఈ సినిమాని ప్రసారం చేస్తుండగా టాటా స్కై తమిళ్ వెర్షన్ మాత్రమే ప్రసారం చేయనుంది. తమిళ్ వెర్షన్ 1000 రూపాయలు, తెలుగు, హిందీ వెర్షన్ అయితే 500 రూపాయలుగా నిర్ణయించారు. పైరసీ కంట్రోల్ చేయడానికి ఇదొక ప్రయోగం అవుతుందనీ, ముందు రోజు టీవీలో చూసి రికార్డ్ చేయొచ్చని చాలామంది అడుగుతున్నారు. కానీ రికార్డ్ చేయకుండా టెక్నాలజీ వాడాము. డీటీహెచ్ లో ప్రీమియర్ వేస్తాము అని ప్రకటించినపుడు తమిళనాడులో కొందరు ధియేటర్ యజమానులు గొడవ చేసారు. కొత్త టెక్నాలజీని ఎవరూ ఆపలేరు. మొదట్లో అడ్డుకోవడానికి ప్రయత్నించారు. జనవరి 11న తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో ధియేటర్లలో విడుదల చేయబోతున్నాం అని కమల్ హాసన్ అన్నారు.