“వకీల్ సాబ్” ట్రీట్ ఉన్నట్టా లేనట్టా..?

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా తెరకెక్కిస్తున్న చిత్రం “వకీల్ సాబ్”. దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కం బ్యాక్ చిత్రం కావడంతో దీనిపై అన్ని అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమా నుంచి టీజర్ కోసం ఎప్పటి నుంచో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో మిస్సయిన ఈ ట్రీట్ ను మేకర్స్ ఫైనల్ గా కొత్త సంవత్సర కానుకగా అందివ్వనున్నాని బజ్ బయటకొచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ విషయం పై మాత్రం ఇంకా ఎలాంటి మూమెంట్ లేనట్టే తెలుస్తుంది. దీనితో మళ్ళీ అనుమానాలు మొదలయ్యాయి.

మేకర్స్ నుంచి ఈసారి అయినా సరే అప్డేట్ ఉందా లేదా అన్నది మిస్టరీగా మారింది. ఇప్పటికే పవన్ అభిమానులు సరైన అప్డేట్ ఒకటి లేక చాన్నాళ్ల నుంచి సతమతమవుతున్నారు. మరి మేకర్స్ నుంచి ఈ టీజర్ ఇప్పుడప్పుడే వచ్చే సూచనలు కూడా ఇంకా కనిపించడం లేదు. మరి ముందు రోజుల్లో ఏం జరగనుందో చూడాలి.

Exit mobile version