పవర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్ కు ముహూర్తం ఖరారు.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్లాన్ చేసిన లైనప్ లో లేటెస్ట్ గా యాడ్ అయిన క్రేజీ ప్రాజెక్ట్ “అయ్యప్పణం కోషియం” రీమేక్. యువ దర్శకుడు సాగర్ చంద్ర దర్శకత్వం వహించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జస్ట్ అనౌన్స్మెంట్ తోనే భారీ హైప్ ను తెచ్చేసుకుంది. ఇక అలాగే పవన్ రోల్ తో పాటు ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో ఎవరు నటిస్తారు అన్న టాక్ లో వచ్చిన రానా పేరే ఫైనల్ అయ్యింది. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించి మేకర్స్ లేటెస్ట్ గా మరో అనౌన్స్మెంట్ కూడా చేసేసారు.

ఈ చిత్రం తాలూకా ముహుర్తంను రేపు డిసెంబర్ 21న ఫిక్స్ చేసారు. అలాగే ఈ ముహూర్తంలో పవన్ మరియు రానా ఇద్దరు కూడా పాల్గొననున్నట్టు టాక్. ఇక మంచి హైప్ ను నమోదు చేసుకున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు పవన్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న విషయం ఏ రేంజ్ హాట్ టాపిక్ అయ్యిందో తెలిసిందే. మొత్తానికి మాత్రం ఈ సినిమా పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Exit mobile version