ఇంట్లో వేంకటేశ్వరుడి క్యాలెండర్ ఉంది కదా అని తిరుపతి వెళ్ళకుండా ఉంటామా

Kamal-Haasanలోక నాయకుడు కమల్ హాసన్ ‘విశ్వరూపం’ తెలుగు వెర్షన్ ఆడియో విడుదల కార్యక్రమంలో కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసారు. ఆయనే, నటుడి, దర్శకుడు, నిర్మాతగా మారి రూపొందించిన విశ్వరూపం తెలుగు వెర్షన్ ఆడియో విడుదల కార్యక్రమం నిన్న జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమాని డీటీహెచ్ లో విడుదల చేస్తున్నారు కదా అని ధియేటర్ కి ఎవరూ రారు అనుకోవద్దు. ఇంట్లో వెంకటేశ్వరా స్వామి క్యాలెండర్ ఉంది కదా అని తిరుపతి వెళ్ళకుండా ఉంటామా? తిరుపతి వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గదు కదా. ఇది కూడా అంతే అన్నారు. విశ్వరూపం సినిమా జనవరి 11న విడుదలవుతుండగా, విడుదలకి ఒకరోజు ముందే డీటీహెచ్ లో ప్రీమియర్ షో వేయనున్నారు. తెలుగు, హిందీ వెర్షన్ అయితే 500, తమిళ్ అయితే 1000 రూపాయలుగా రేటు ఫిక్స్ చేసారు. సినిమా ప్రమోషన్లో ఇదొక సరికొత్త ప్రయోగం. పైరసీని అరికట్టడానికి ఇది ఉపయోగపడుతుంది.

Exit mobile version