“సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది ఈ చిత్రం జనవరి 11న భారీ విడుదల అవ్వడానికి సిద్దమయ్యింది. ఈ చిత్ర రీ రికార్డింగ్ పనులు జరుపుకుంటుంది ఇప్పటికే మొదటి అర్ధం రీ రికార్డింగ్ పూర్తయ్యింది ఈ చిత్ర సాంకేతిక నిపుణులు అనుకున్న తేదీకి విడుదల చెయ్యడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇప్పటికే మిక్కి జె మేయర్ అందించిన సంగీతం ప్రేక్షకుల మెప్పు పొందింది. విక్టరీ వెంకటేష్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ముల పాత్రలలో కనిపిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ వెచ్చించి తెరకెక్కించారు సమంత మరియు అంజలి కథానాయికలుగా నటించారు.