మన టాలీవుడ్ లోకి వచ్చిన అనతి కాలంలోనే మంచి క్రేజ్ అండ్ స్టార్డం తెచ్చుకున్న యంగ్ హీరోయిన్స్ లో రష్మికా మందన్నా కూడా ఒకడు. టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ ఇప్పుడు భారీ చిత్రాలతో మరింత బిజీగా ఉంది. అయితే యూత్ లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కు జాతీయ స్థాయిలోనే ఓ అరుదైన ఘనత దక్కింది.
ఇది మనం చెప్పుకున్నదో లేక మరే ఇతర ఇండస్ట్రీ వారు ఇచ్చిందో కాదు. స్వయంగా ప్రపంచంలోనే బిగ్గెస్ట్ సెర్చ్ ఇంజిన్ అయినటువంటి గూగుల్ చెప్తున్నా మాటే. రష్మికా నుంచి జాతీయ స్థాయి క్రష్ గా ఎంపిక చెయ్యడం ఇప్పుడు మంచి హాట్ టాపిక్ అయ్యింది. డౌట్ ఉంటే గూగుల్ లో నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా అని సెర్చ్ చేస్తే వారు తాము ఎంపిక చేసింది. రష్మికా పేరునే అని చూపిస్తున్నారు. మొత్తానికి మాత్రం రష్మికా రేంజ్ మామూలుగా లేదని చెప్పాలి.