ఉపేంద్ర రాజకీయ పార్టీపై వర్మ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

సినిమా అలాగే రాజకీయాలు రెండూ పూర్తి విభిన్నమైనవి కానీ సినిమా నుంచే చాలా మంది రాజకీయాల్లోకి వెళ్లి విజయం అందుకున్న వారు ఉన్నారు ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న వారు ఉన్నారు. అలా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు రాజకీయ పార్టీలు ఉన్నాయి. అలా ఇప్పుడు కన్నడ స్టార్ నటుడు మరియు దర్శకుడు ఉపేంద్ర “ఉత్తమ ప్రజాకీయ పార్టీ” అనే కొత్త పార్టీను స్థాపించారు.

దీనిపై సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన వ్యూ ను పోస్ట్ చేసారు. ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో కూడా వేలు పెడుతున్న రామ్ గోపాల్ వర్మ “విప్లవానికి దారీ తీసే క్రమంలో రాజకీయాల్లోకి కొత్త పార్టీ అడుగు పెట్టడం గ్రేట్ అని ఉపేంద్రకు పెద్ద ఎత్తున ప్రశంసలు ఇవ్వాల్సిందే” అని ఏదో పాజిటివ్ గా ఉన్నట్టుగా ఎప్పటిలానే అర్ధం కానీ రీతి పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లో ఉపేంద్ర పార్టీ తాలూకా కొన్ని విధి విధానాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికి మాత్రం ఉపేంద్ర కొత్త అడుగుకి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Exit mobile version