సల్మాన్‌కి కరోనా నెగెటివ్.. ఊపిరి పీల్చుకున్న అభిమానులు


కరోనా సినీ పరిశ్రమను బిజినెస్ పరంగా దెబ్బకొట్టడమే కాకుండా కొందరు నటీనటులను వ్యక్తిగతంగాను వేధించింది. ఎంతోమంది నటీనటులు, పాపులర్ టెక్నీషియన్లు కరోనా బారినపడ్డారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నిత్యం నలుగురు మధ్యలో ఉండాల్సి రావడంతో సెలబ్రిటీలు కరోనాకు ఎఫెక్ట్ కావాల్సి వస్తోంది. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, తమన్నా, పృథ్విరాజ్ మనోహరన్, డాక్టర్ రాజశేఖర్ లాంటి నటీనటులు ఎందరినో కరోనా తాకింది.

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను సైతం కరోనా కంగారుపెట్టేసింది. ఆయన వ్యక్తిగత డ్రైవర్, మరో ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో సల్మాన్ కుటుంబంతో సహా సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు. eఏ సంగతి తెలిసిన ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే కరోనా పరీక్షలు చేయించుకోగా సల్మాన్, ఆయన కుటుంబ సభ్యులకు నెగెటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు కరోనా సోకిన తన సిబ్బందిని సల్మాన్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

Exit mobile version