డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం బ్యాంకాక్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. పూరి, బండ్ల గణేష్, సుబ్బరాజు కలిసి ఉన్న ఈ ఫోటోను బండ్ల గణేష్ ట్విట్టర్లో పోస్ట్ చేసారు. చూస్తుంటే ముగ్గురూ ఫుల్ హ్యాపీ మూడ్లో ఉన్నట్టున్నారు.