మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది పూరి జగన్నాథ్ ‘చిరుత’ సినిమాతోనే. వారి కాంబోలో వచ్చిన ఈ చిత్రం మెగా అభిమానులను బాగా ఆకట్టుకుంది. అది రామ్ చరణ్ కు మంచి ఆరంభాన్ని ఇచ్చింది. అందుకే చరణ్, పూరిల మధ్యన మంచి రిలేషన్ ఉంది. ఆ సినిమా తర్వాత కూడ చరణ్ పూరితో కలిసి సినిమా చేయాలని చాలాసార్లు ప్రయత్నించినా కుదరలేదు. అటు పూరి బిజీగా ఉండటం, ఇటు చరణ్ కు కూడ నిత్యం ఏదో ఒక కమిట్మెంట్ ఉండటంతో కలిసి వర్క్ చేయడం సాధ్యపడలేదు.
కానీ త్వరలో వీరిద్దరి కలయిక సెట్టయ్యేలానే ఉంది. చరణ్ కోసం పూరి కథను రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రసుతం ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్న చరణ్ తర్వాత ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఒకటి చేస్తే బాగుంటుందని భావిస్తున్నారట. అందుకే పూరిని సంప్రదించారని, పూరి కూడ చరణ్ తో సినిమాకు ఓకే చెప్పేశారని, ప్రస్తుతం కథను ఫైనల్ చేసే పనిలో ఉన్నారని ఫిలిం నగర్ టాక్. ప్రస్తుతానికి పూరి విజయ్ దేవరకొండ హీరోగా ‘ఫైటర్’ సినిమా చేస్తున్నారు. అది పూర్తయ్యేలోపు చెర్రీతో సినిమాపై ఒక క్లారిటీ వస్తుందని, అంతా కుదిరితే వచ్చే ఏడాదిలోనే వీరి సినిమా మొదలవుతుందని చెబుతున్నారు.