కోలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ రెడీ అవుతుందా.?

మామూలుగానే మన దగ్గర లేడీ ఫిల్మ్ మేకర్స్ చాలా తక్కువ కానీ ఉన్న కొద్ది మందిలోనే అందించిన సినిమాలు మాత్రం అమోఘం అని చెప్పాలి. వారిలో ముఖ్యంగా కోలీవుడ్ లేడీ ఫిల్మ్ మేకర్స్ సుధా కొంగర ఒకరు. కోలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి సూర్యతో తీసిన లేటెస్ట్ చిత్రం “ఆకాశం నీ హద్దురా”తో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న ఈ దర్శకురాలి పట్ల మరింత గౌరవం కూడా అందరికీ పెరిగింది.

ఇక ఇదిలా ఉంటే ఈ టాలెండ్ డైరెక్టర్ ఇపుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ తో రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సూర్యతో అద్భుతమైన సినిమా అందించిన ఈమె ఎప్పుడు సూర్య తమ్ముడు కార్తీతో ఒక సినిమాను టేకప్ చెయ్యనున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. సూర్యతో పాటుగా కార్తీకు కూడా మన దగ్గర మంచి క్రేజ్ ఉంది. మరి నిజంగానే ఈ కాంబో సెట్టయితే మరోసారి మంచి సబ్జెక్టు తోనే ముందుకొస్తారని చెప్పడంలో సందేహం లేదు. మరి ఈ కాంబో ఉందో లేదో కాలమే నిర్ణయించాలి.

Exit mobile version