“రౌడీ బేబీ”కి ఏకంగా 1 బిలియన్ల వ్యూస్ !


ధనుష్, సాయి పల్లవి హీరో హీరోయిన్స్ గా నటించిన చిత్రం “మారి-2”. ఈ మూవీలోని “రౌడీ బేబీ” సాంగ్ యూట్యూబ్ రికార్డ్స్ కి ఇప్పట్లో బ్రేక్స్ పడేలాలేవు. తాజాగా యూట్యూబ్ లో ఈసాంగ్ ఏకంగా 1 బిలియన్ల వ్యూస్ కి చేరి రికార్డు సృష్టించింది. 1 బిలియన్లకు పైగా వ్యూస్ అంటే.. మన దేశ జనాభాలో లో సగం మంది పైగా ప్రజలు వీక్షించినట్లు లెక్క . బాలాజీ మోహన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అంతగా విజయం సాధించకపోయినా, యువన్ శంకర్ స్వరపరిచిన ఈ పాటకు తెలుగు, తమిళ భాషల్లో మంచి ఆదరణ దక్కింది.

తెలుగులో సాయి పల్లవి చేసిన మొదటి మూవీ “ఫిదా” లోని “వచ్చిండే’ సాంగ్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ధనుష్ అంతకు ముందు శృతి హాసన్ హీరోయిన్గా చేసిన “మూడు” సినిమాలోని “వై దిస్ కొలవెరి” సాంగ్ కూడా దేశవ్యాప్తంగా పాపులారిటీ పొంది రికార్డు వ్యూస్ సాదించింది. ఇలా సాయి పల్లవి, ధనుష్ తమ పాటలతో యూట్యూబ్ పై రికార్డుల దండయాత్ర చేస్తున్నారు.

Exit mobile version