సెకెండ్ షెడ్యూల్ కి ‘ఆద్య’ రెడీ !

ఒక పవర్ ఫుల్ లేడి ఓరియంటెడ్ పాన్ ఇండియా వెబ్ సిరీస్ తో తన సెకండ్ ఇన్నింగ్స్ కి శ్రీకారం చుట్టారు రేణు దేశాయ్. కాగా ప్రస్తుతం ఈ సిరీస్ సెకెండ్ షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది. రేపటి నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ స్టార్ట్ కానుంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో నందిని రాయ్ తోపాటు బాలీవుడ్ హీరో ‘వైభవ్ తత్వవాడి’ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. కాగా ‘రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఇస్తున్న ‘ఆద్య’ జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ సిరీస్ తో ఎం.ఆర్.కృష్ణ మామిడాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

కాగా ఈ సిరీస్ కు రజనీకాంత్.ఎస్, డి.ఎస్.రావు నిర్మాతలుగా ఉన్నారు. ఇక రేణూ దేశాయ్ ఈ వెబ్ సిరీస్ చేయడానికి ముఖ్య కారణం.. దర్శకుడు కృష్ణ చెప్పిన కథనేనట. కృష్ణ చెప్పిన కథ తనను విపరీతంగా ఆకట్టుకుందని, దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యేంత గొప్ప కథ అని.. అందుకే కథను సింగిల్ సిట్టింగ్ లో ఓకె చేసానని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. మరి చూడాలి.. ఈ సిరీస్ ఎలా ఉండబోతుందో. అన్నట్లు రేణు దేశాయ్ ప్రస్తుతం ఓ సినిమాని కూడా డైరెక్ట్ చేస్తోంది. రైతుల సమస్యల పై ఆ సినిమా వస్తోంది.

Exit mobile version