నానితో మరో ఎంటర్ టైనర్.. నిజమేనా ?

గత కొన్ని నెలల నుండి ఈ న్యూస్ సోషల్ మీడియాలో తరుచుగా వినిపిస్తూనే ఉంది. నేచురల్ స్టార్ నాని – మారుతి కలయికలో మరో ఎంటర్ టైనర్ రాబోతోందని. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా ‘భలే భలే మగాడివోయ్’. ఈ సినిమాతోనే నాని మార్కెట్ స్థాయి కూడా పెరిగింది. ఈ చిత్రాన్ని మారుతి డైరెక్ట్ చేశారు. ఈ సినిమా తర్వాత మారుతి, నాని కలిసి మరొక సినిమా చేయాలన్నారు. కానీ ఇప్పటివరకు అది సాధ్యపడలేదు. అయితే త్వరలో వీరి కాంబినేషన్ పట్టాలెక్కే సూచనలు కనబడుతున్నాయని మళ్లీ వార్తలు వస్తున్నాయి.

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం వీరి ప్రాజెక్ట్ చర్చల దశ కూడా పూర్తి అయిందట. మారుతి, నాని కోసం ఫుల్ ఎంటర్ టైనర్ ను సిద్ధం చేశారట. ఇప్పటికే మారుతి స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేశాడట. అయితే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అఫీషియల్ క్కన్ఫర్మేషన్ అయితే ఇంతవరకు రాలేదు. కాకపోతే వీరి కాంబినేషన్ లో సినిమా కచ్చితంగా వస్తోందని ఫిల్మ్ సర్కిల్స్ లో గత కొన్నాళ్ళుగా బాగా వినిపిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం నాని త్వరలో ‘టక్ జగదీష్’ సినిమా షూట్ లో బిజీ ఉన్నాడు.

Exit mobile version