విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ కోసం స్పెషల్ సెట్ !

డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ కలయికలో వస్తోన్న ‘ఫైటర్’ సినిమా క్లైమాక్స్ షూటింగ్ కోసం ప్రత్యేకంగా ఓ అండర్ గ్రౌండ్ డాన్ హౌస్ సెట్ వేస్తున్నారట. డిసెంబర్ సెకెండ్ వీక్ నుండి విజయ్ దేవరకొండ పై ముందుగా ఈ సెట్ లో ఫైట్ సీన్ షూట్ చేస్తారట. ఇక ఈ సినిమా ఓ డాన్ అతని కొడుకుకి మధ్య నడుస్తోందట. డాన్ కొడుకు పాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడట. కాగా ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు.

ఫైటర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యాడు. ఇక విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి. అలాగే ‘ఇస్మార్ట్ శంకర్’ ఇచ్చిన సక్సెస్ కిక్ తో ప్రస్తుతం పూరి ఈ సినిమాని చేస్తున్నాడు.

Exit mobile version