బాలయ్య షూటింగ్ ప్లాన్ మారింది !

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య చేస్తోన్న యాక్షన్ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను ఈ నెల 29వ తేదీ నుండి నంద్యాలలో షూట్ చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ షెడ్యుల్ ను పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కొత్త హీరోయిన్ నటిస్తోంది.

కాగా ఆ మధ్య ఒక నిమిషానికి పైగా వచ్చిన ఈ సినిమా టీజర్ లో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ అండ్ దుమ్ము రేపే యాక్షన్ తో రెచ్చిపోయారు. కాగా బాలయ్యకు ‘సింహ’, ‘లెజెండ్’ లాంటి సూపర్ విజయాలను అందించారు బోయపాటి. కాబట్టి ఈసారి కూడా సూపర్ హిట్ ఇస్తాడని బాలయ్య ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version