“కిన్నెరసాని” అనే ఇంట్రెస్టింగ్ సినిమాతో వస్తున్న కళ్యాణ్ దేవ్!

మెగా అల్లుడుగా టాలీవుడ్ కు పరిచయం అయిన టాలెంటెడ్ హీరో కళ్యాణ్ “విజేత”గా ఆకట్టుకున్నాడు. ఇపుడు అలాగే లేటెస్ట్ గా టాలెంటెడ్ దర్శకుడు “అశ్వథ్థామ” ఫేమ్ రమణ తేజ దర్శకత్వంలో ఇటీవలే ఓ ప్రాజెక్ట్ కు ముహూర్తం కుదిరింది. కథ మరియు కథనం దేశరాజ్ సాయి తేజ్ అందిస్తున్న ఈ చిత్రానికి “కిన్నెరసాని” అనే టైటిల్ ను ఫిక్స్ చేసి షూట్ ను స్టార్ట్ చేసినట్టుగా తెలిపారు.

అయితే టైటిల్ ను దీపావళి సందర్భంగా రివీల్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ ను గమనిస్తే సినిమాపై మరింత ఆసక్తి రేపుతుంది.సముద్రం, ఒక పుస్తకానికి గొలుసుతో కళ్లెం వెయ్యడం వంటివి స్టోరీ లైన్ ఏంటా అన్నది అనిపిస్తుంది. ఈ చిత్రంలో లవ్ అండ్ పెయిన్ ను ఈ చిత్రం ద్వారా మేకర్స్ చూపించనున్నారు. ఈ చిత్రానికి టాలెంటెడ్ అండ్ యంగ్ సంగీత దర్శకుడు మహతి సాగర్ సంగీతం ఇస్తుండగా ఎస్ ఆర్ టి మూవీస్ వారు నిర్మిస్తున్నారు.

Exit mobile version