“ఆదిపురుష్” రెగ్యులర్ షూట్ అప్పటి నుంచే.?

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో తెరకెక్కిస్తున్న “ఆదిపురుష్” ఒకటి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ఇతిహాస గాథపై దేశ వ్యాప్తంగా కూడా భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి.

ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ మేజర్ హైలైట్ అవ్వనున్నాయని గట్టి టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో ఈ షూట్ పై ఎప్పటి నుంచో వినిపిస్తున్న అప్డేట్ నిజం కానుంది. అయితే ఈ చిత్రం తాలుకా రెగ్యులర్ షూట్ వచ్చే జనవరిలో మొదలు కానుందట. అది కూడా సంక్రాంతి తర్వాతనే అన్నట్టుగా తెలుస్తుంది.

ఇప్పటికే ప్రభాస్ ఒకపక్క రాధే శ్యామ్ కు ప్రిపేర్ అవుతూ ఆదిపురుష్ కోసం కూడా తన లుక్ ను ప్రిపేర్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక అలాగే ఈ చిత్రాన్ని కూడా సాధ్యమైనంత త్వరగానే పూర్తి చేసేయాలని ప్రభాస్ భావిస్తుండగా ఇపుడు ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఈ భారీ చిత్రంలో ప్రభాస్ రాముని పాత్రలో కనిపిస్తుండగా ఖాన్ రావణ పాత్రలో కనిపించనున్నారు.దాదాపు 500 నుంచి 1000 కోట్లు వరకు పెట్టడానికి రెడీగా ఉన్న ఈ చిత్రానికి ఇంకా హీరోయిన్ ఫైనలైజ్ కావాల్సి ఉంది.

Exit mobile version