“RRR” యూనిట్ మామూలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వట్లేదు!

ఇప్పుడు మన దేశ వ్యాప్తంగా భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్నా పాన్ ఇండియన్ చిత్రాల్లో మన తెలుగు నుంచి రానున్న “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కిస్తున్న రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంకు సంబంధించి ఒకప్పుడు అప్డేట్స్ కాస్త గ్యాప్ తోనే వదిలేవారు.

కానీ ఇప్పుడు పరిస్థితులు మారడంతో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షూట్ పై అప్డేట్స్ ఇవ్వడంతో పాటుగా ఈ సినిమా ఫాలోవర్స్ కు కూడా మాంచి ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నారు. ఎవరైనా అభిమానులు దేనికోసం అయినా అడిగినా చాలా ఫన్నీగా రెస్పాండ్ అవుతూ ట్విట్టర్ లో ఎంటర్టైన్ చేస్తున్నారు.

అలాగే వాటితోనే మంచి ఇంట్రాక్షన్ తో అభిమానులను కూడా ఎప్పటికప్పుడు అలెర్ట్ చేసినవారు అవుతున్నారు. గత కొన్ని రోజుల నుంచీ కూడా ఇదే జరుగుతుంది. వీటితో అభిమానులు కూడా అప్డేట్స్ పరంగా ఒక క్లారిటీకి వస్తున్నారు. మొత్తానికి “RRR” యూనిట్ ఇచ్చే రిప్లైస్ ఎంటర్టైన్మెంట్ మాత్రం మాములుగా ఉండట్లేదని చెప్పాలి.

Exit mobile version