ఈసారి “ఆదిపురుష్” టీం టేకప్ చేస్తారా?


ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో “ఆదిపురుష్” కూడా ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ ప్లాన్ చేస్తున్న ఈ మహా కావ్యంలో ప్రభాస్ రామునిగా నటిస్తుండగా రావణ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రకటన అలాగే ప్రభాస్ మరియు సైఫ్ ల తాలూకా రోల్స్ ను రివీల్ చెయ్యడం కూడా వెంటవెంటనే జరిగిపోయాయి.

కానీ అక్కడ నుంచి ప్రభాస్ పుట్టినరోజు వరకు వీరి టీం నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. అప్పుడు ఆ సమయాన్ని “రాధే శ్యామ్” యూనిట్ భర్తీ చేసింది. కానీ ఇప్పుడు వస్తున్న దీపావళి సమయాన్ని మాత్రం ఆదిపురుష్ టీం టేకప్ చేస్తున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఎలాగో దీపావళి పర్వదినం వీరి సబ్జెక్టు కు ఎంత ప్రత్యేకమో తెలిసిందే. మరి నిజంగానే ఏదన్న అప్డేట్ ను మేకర్స్ వదులుతారో లేదో చూడాలి.

Exit mobile version