మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రానున్న ‘నాయక్’ సినిమా కోసం రామ్ చరణ్ కంటిన్యూ గా డబ్బింగ్ చెబుతున్నాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. చరణ్ ముక్కుకి గాయమైందని పుకార్లు వస్తున్నాయి. కానీ రామ్ చరణ్ ఇలా కంటిన్యూగా డబ్బింగ్ చెప్పడం చూస్తుంటే ఆయన ఆరోగ్యంగా ఉన్నాడని తెలుస్తోంది. మాస్ డైరెక్టర్ వి.వి వినాయక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని డి.వి.వి దానయ్య నిర్మించారు.
తగు మోతాదులో యాక్షన్, ఎంటర్టైన్మెంట్ కలగలిపిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, అమలా పాల్ హీరోయిన్స్ గా నటించారు. ఒక బిగ్ బడ్జెట్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా భారీగా ప్రీ రిలీజ్ బుజినెస్ చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తుందని అంచనా వేస్తున్నారు.