“పుష్ప”రాజ్ స్టోరీపై ఇంట్రెస్టింగ్ గాసిప్స్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం “పుష్ప”. ఎప్పుడో షూటింగ్ మొదలు కావాల్సి ఉన్న ఈ చిత్రం ఇప్పుడు షూట్ ను స్టార్ట్ చేసుకుంది. అయితే ఈ సినిమాపై అంచనాలు కూడా మంచి హై లోనే ఉన్నాయి.

బన్నీ సుకుమార్ అలాగే దేవికాంబో కావడం అందులోను వీరి నుంచి మొట్ట మొదటి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ఇది కావడంతో మరింత స్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో పుష్పరాజ్ గా కనిపించనున్న బన్నీ రోల్ ను సుక్కు అద్భుతంగా మరియు చాలా స్ట్రాంగ్ బ్యాక్ డ్రాప్ లో రాసుకున్నారట.

పుష్పరాజ్ అనే కుర్రాడు ఒక స్మగ్లర్ గా ఎలా మారుతాడు అనేది సుకుమార్ సూపర్బ్ గా డిజైన్ చేశారు అన్నట్టు తెలుస్తుంది. ఇవన్నీ పాన్ ఇండియన్ లెవెల్ కు ఏ రేంజ్ లో ఉండాలో అంతే లెవెల్లో సుకుమార్ ప్లాన్ చేశారట. మరి తన పుష్ప రాజ్ ను దర్శకుడు సుకుమార్ ఎలా చూపిస్తారో చూడాలి.

Exit mobile version