మాస్ట్రో ఇళయరాజాకి అరుదైన పురష్కారం.!


1952లో స్థాపించబడి భారత ప్రభుత్వం చేత గుర్తింపబడిన సంస్థ సంగీత్ నాటక్ అకాడమీ. ఎన్నో పేరు ప్రఖ్యాతలు ఉన్నవారు ఈ సంస్థ నుండి తమ కళకు ఉత్తమ పురష్కారం అందుకోవాలని అనుకుంటారు. అలాంటి ఈ సంస్థ ఈ సంవత్సరం సినీ రంగానికి సంబందించిన ఒక వ్యక్తికి తమ అవార్డు బహుకరించాలని అనుకుంది. కానీ ఎంతో మంది గొప్ప వారు ఉన్న సినీ రంగంలో ఎవరో ఒకరినే ఒకరిని ఎంచుకోవాలి అంటే ఎంతో కష్టమైన పని. మొత్తానికి ఎన్నో తర్జన బర్జనలు పడిన సంగీత్ నాటక్ అకాడమీ వారు చివరికి సంగీత ప్రపంచంలో ఎప్పటికప్పుడు క్రియేటివ్, ప్రయోగాత్మకమైన తన మ్యూజిక్ తో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్న మాస్ట్రో ఇళయరాజాని ఎంచుకున్నారు. 2012 సంవత్సరానికి గాను ఇళయరాజాకి సంగీత్ నాటక్ అకాడమీ అవార్డును బహుకరించానున్నారు. ఇలాంటి అరుదైన పురస్కారాన్ని అందుకోనున్న ఇళయరాజా గారికి ఇవే మా శుభాకాంక్షలు.

Exit mobile version