ఏ హీరోకి లేని విధంగా రికార్డ్ సెట్ చేసిన చరణ్.!

మన టాలీవుడ్ లో మంచి మాస్ క్రౌడ్ పుల్లింగ్ హీరోస్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు. అవ్వడానికి మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయినా తన స్వేదంతో తన వ్యక్తిత్వంతో తనకంటూ సెపరేట్ క్రేజ్ ను తెచ్చుకొని ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ గా మారాడు.

అయితే చరణ్ కు మన దగ్గర అపారమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. కానీ గత కొన్నాళ్ల కితం వరకు మాత్రం అతడు సోషల్ మీడియాలో లేదు. ఒక్క పేస్ బుక్ మినహా.. ఇక ఎందులోనూ చరణ్ లేడు. కానీ ఈ ఏడాదే అత్యంత పాపులార్ అయినటువంటి ట్విట్టర్ మాధ్యమంలోకి వచ్చాడు.

అయితే ఇందులో మాత్రం మన తెలుగు హీరోల్లో ఏ హీరోకి కూడా దక్కని ఫాస్టెస్ట్ రికార్డును చరణ్ క్లాక్ చేసినట్టు తెలుస్తుంది. గత మార్చ్ నెలలో ట్విట్టర్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కేవలం 233 రోజుల్లోనే రికార్డు స్థాయి 1 మిలియన్ ఫాలోవర్స్ ను రాబట్టుకొని తెలుగులో ఏ హీరోకు కూడా లేని ఫాస్టెస్ట్ రికార్డు కౌంట్ ను అందుకున్నాడట.

దీనితో ఈ ఫాస్టేట్ రికార్డు ను చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం చరణ్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో హీరోగా బిగ్గెస్ట్ మల్టీ స్టారింగ్ పీరియాడిక్ డ్రామా “రౌద్రం రణం రుధిరం” అనే పాన్ ఇండియన్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version